ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళయరాజాకు వ్య‌తిరేకంగా హైకోర్టుకు ఆరుగురు నిర్మాతలు!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 23, 2018, 01:48 PM

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఇళయరాజా తన పాటలకు మొత్తం రాయల్టీని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆరుగురు నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. సంగీత దర్శకుడు వసూలు చేస్తున్న రాయల్టీలో కనీసం 50 శాతాన్ని ఆ చిత్ర నిర్మాతకు ఇవ్వాలని ప్రొడ్యూసర్లు పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్‌ కోరారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా తన పాటలను వేదికలపై ఆలపించరాదనీ, అలా చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని ఇళయరాజా గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన పాటలకు ఆయన గత 5 ఏళ్లుగా రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాటలపై పూర్తి హక్కు తనకే ఉంటుందని ఇళయరాజా చెప్పడం సరికాదని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. సంగీత దర్శకుడు అందుకుంటున్న రాయల్టీలో నిర్మాతకు కనీసం 50 శాతం ఇవ్వాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa