నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమా టైటిల్ నిన్న రాత్రి కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో అఫీషియల్ గా రివీల్ అయ్యింది. ఈ సినిమాకు "వీరసింహారెడ్డి" అనే పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనేది శీర్షిక. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికే ఈ సినిమా రాబోతుందని రిలీజ్ టైం కూడా ఎనౌన్స్ చేసి నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోస్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa