ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివిశేష్ "హిట్ 2" పై లేటెస్ట్ ఇంటరెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 09:05 AM

మేజర్ సక్సెస్ తో ఇటీవలే పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యువ హీరో అడివిశేష్. త్వరలోనే హిట్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అడివిశేష్ లీడ్ హీరోగా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ మూవీస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తుండగా, నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా టీజర్ రఫ్ కట్ చూసిన శేష్ దాంతో ఫుల్ సాటిస్ఫై అయినట్టు తెలుస్తుంది. ఈ మేరకు శేష్ ట్వీట్ చేసాడు. ఏమనంటే, ఇప్పుడే హిట్ 2 టీజర్ రఫ్ కట్ చూసాను..మై న్యూ అవతార్ ఈజ్ లోడింగ్ .. అంటూ డైరెక్టర్ శైలేష్ కి, నిర్మాత నానికి శేష్ కృతజ్ఞతలు తెలిపారు. అంటే మరి కొన్ని రోజుల్లోనే హిట్ 2 టీజర్ ప్రేక్షకులను పలకరించబోతుందన్న మాట. పోతే, ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa