మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం "మెగా 154"(వర్కింగ్ టైటిల్). కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఒకటి మెగా, మాస్ రాజా అభిమానుల్లో ఫుల్ ఖుషి ని నింపుతుంది. అదేంటి అనుకుంటున్నారా... మెగా 154లో ఒక పర్ఫెక్ట్ మాస్ సాంగ్ ఉండబోతుందంట. దానికి చిరు, రవితేజ కలిసి వేసే క్రేజీ స్టెప్స్ చూసి అభిమానులకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుందట. ఆల్రెడీ మొన్న రిలీజైన గాడ్ ఫాదర్ లో చిరు, సల్మాన్ కలిసి "తార్ మార్ తక్కర్ మార్" లో కాలు కదిపారు. ఆ పాటకు మెగా అభిమానుల నుండి ఎంతటి విశేష స్పందన వచ్చిందో తెలిసిందే. మైరి ఇప్పుడు మెగా 154లో కూడా ఇలాంటిదే ఒక పాట ఉండబోతుందంటే, ప్రేక్షకుల్లో హై ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి.
![]() |
![]() |