తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం "వారసుడు". వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో "వారిసు" టైటిల్ తో తెరకెక్కుతుంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషలలో విడుదలైన కానున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్, రష్మిక మండన్నా లపై ఒక డ్యూయెట్ సాంగ్ ను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారట. దివాళికి ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. కానీ, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక పోస్టర్ రిలీజ్ అవ్వలేదు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.