దసరా కానుకగా విడుదలైన సినిమాలలో కింగ్ నాగార్జున "ది ఘోస్ట్" ఒకటి. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చినవి కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించలేక ఘోస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.
దీంతో త్వరలోనే ఈ సినిమా డిజిటల్ రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా నవంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో ది ఘోస్ట్ మూవీ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యిందని అంటున్నారు. చూడాలి మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో ..!!
సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భరత్ సౌరభ్ సంగీతం అందించారు.