మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 2020లో వచ్చిన సినిమా 'అల వైకుంఠపురంలో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం ఐతే గ్లోబల్ లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. యూట్యూబులో 1 బిలియన్ కి పైగా వ్యూస్ సాధించిన ఏకైక సౌత్ సినిమా సౌండ్ ట్రాక్ ఈ సినిమా సొంతం.
తాజా సమాచారం ప్రకారం, అల వైకుంఠపురంలో సినిమా తదుపరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బెస్ట్ సౌండ్ ట్రాక్ వారసుడు సినిమాకేనట. వారసుడు సాంగ్స్ చాలా బాగా వచ్చాయట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో వారసుడు మూవీ సాంగ్స్ పై అంతటా ఆసక్తి నెలకొంది.