పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేపు 43వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టుల నుండి బిగ్ సర్ప్రైజెస్ ను ఆశిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
తాజాగా ఒక డార్లింగ్ అభిమాని సోషల్ మీడియా పోస్ట్ కు రిప్లై ఇస్తూ ప్రాజెక్ట్ కే డైరెక్టర్ నాగ్ అశ్విన్ రేపు చిన్న ట్రీట్ రాబోతుందని సర్ప్రైజ్ రివీల్ చేసారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి రేపు రాబోతున్న ప్రాజెక్ట్ కే సంథింగ్ స్మాల్ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.