డస్కీ సైరన్ పూజా హెగ్డే ఇటీవలే లిగమెంట్ టియర్ తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో పూజా చెయ్యాల్సిన సినిమాల షూటింగులకు బ్రేక్ పడుతుందని అంతా అనుకున్నారు కానీ, ఇలా అనుకుంటున్న వారందరికీ పూజా స్వీట్ షాకిచ్చింది.
తన కాలికి కట్టు కట్టు ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన రెండో రోజే పూజా మేకప్ రూమ్ లో రెడీ అవుతున్నట్టు మరొక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు ది షో మస్ట్ గో ఆన్... అనే కాప్షన్ ఇచ్చింది. పూజా తన వృత్తికి ఇస్తున్న ఇంపోర్టాన్స్ తెలుసుకుని పలువురు నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.