బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "రామ్ సేతు". టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది. నుష్రత్ బరుచ కీలకపాత్రలో నటిస్తుంది.
ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. 2 గంటల 24 నిమిషాల డీసెంట్ రన్ టైం తో కూడిన ఈ సినిమాకు సెన్సార్ బృందం యూఏ సెర్టిఫికెట్ ఇచ్చింది.
అభిషేక్ శర్మ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.