ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 01:43 PM

అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. 2013లో హీరోగా డిబట్ చేసిన శిరీష్ కు ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్ లేదు. దీంతో ఈ సినిమాపై శిరీష్ చాలా ఆశలను పెట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాడు.


తాజాగా ఈ సినిమా పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక యూనిక్ సెలెబ్రిటీ రాబోతున్నారట. దీంతో ఖచ్చితంగా ఆ యూనిక్ పర్సన్ మెగాస్టార్ లేదా పవర్ స్టార్ గానీ అయ్యుంటారు అని చాలామంది అనుకుంటున్నారు. మరికొంతమందేమో బాలకృష్ణ అని అంటున్నారు. ఎందుకంటే, అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా బాలయ్య అరవింద్ మధ్య స్నేహానుబంధం బాగా పెరిగిందట. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చి, శిరీష్ కు సపోర్ట్ ఇస్తారో చూడాలి.


పోతే, ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com