టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగారావు గా ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు చిరు మరియు రవితేజ ఇద్దరూ ఈ సినిమాలో ఒక పర్ఫెక్ట్ మాస్ సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.