అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం' సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది.
ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.