పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ రోజు 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా డార్లింగ్ అభిమానులు, పలువురు సినీ సెలెబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
యాజ్ ఎక్స్పెక్టెడ్ ... ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్టుల నుండి ఒక్కొక్కటిగా అప్డేట్లు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే, ఆదిపురుష్ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో శ్రీ రాముడి ప్రసన్నావతారంలో ప్రభాస్ ఎంతో కూల్ గా కనిపిస్తున్నారు.
ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో విడుదల కాబోతుంది. శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుంటే, ఆయనకు జతగా జానకిగా కృతిసనన్ నటిస్తుంది. రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.