విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ 'ఓరి దేవుడా'. రెండ్రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది.
సినిమాకొస్తున్న బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో చిత్రబృందం పోస్ట్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు విజయవాడలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం జరగనుంది. ఈ మేరకు హీరో విశ్వక్ సేన్, హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ ఈ రోజు సాయంత్రం ఐదింటికి విజయవాడ పీవీపీ మాల్ లో జరగబోయే మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం కి హాజరై అభిమానులతో ముచ్చటించనున్నారు.