గురు పవన్ డైరెక్షన్లో ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "నచ్చింది గర్ల్ ఫ్రెండూ". శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందించారు.
ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఎర్రతోలు పిల్ల అనే లిరికల్ సాంగ్ కి మంచి స్పందన లభించగా తాజాగా మేకర్స్ మరొక లిరికల్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటికి మనసా మనసా అనే లవ్ యాంథం సాంగ్ ను హీరో నితిన్ రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.