రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన న్యాయవాది ద్వారా ఒక లేఖను విడుదల చేశాడు. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొనడం "చాలా దురదృష్టకరం" అని పేర్కొన్నాడు. తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని చెప్పాడు. తాను ఆమెకు, ఆమె కుటుంబానికి గిఫ్టులు ఇస్తే అందులో వారి తప్పేమిటని ప్రశ్నించాడు. జాక్వెలిన్ ప్రేమను మాత్రమే కోరుకుందని, ఇంకేమీ అడగలేదని లేఖలో రాశాడు.