హీరోయిన్ పూర్ణ తాజాగా సీక్రెట్ వెల్లడించింది. వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో తన పెళ్లి జూన్ 12న దుబాయ్‌లో జరిగిపోయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వీసా సమస్య కారణంగా చాలా మంది రాలేకపోయారని తెలిపింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగిపోయిందని వివరించింది. కేరళలో త్వరలో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక దుబాయ్‌లో డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాలన్నదే తన చిరకాల కోరిక అని చెప్పింది.