నవంబర్ 4వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న కన్నడ చిత్రం "బనారస్" నుండి తాజాగా తొలితొలి వలపే అనే రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ గా ఉన్న ఈ సాంగ్ పిక్చరైజషన్ ఎంత బాగుందో, కార్తీక్, చిత్రాల గాత్రం అంత మధురంగా ఉంది. అజనీష్ లోక్ నాధ్ స్వరపరిచిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ అద్భుతంగా ఉంది.
జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా, జయ తీర్ధ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం రియల్ లైఫ్ టైం ట్రావెల్ నేపథ్యంలో జరిగే ఒక అందమైన ప్రేమ కథ. ఈ సినిమాను నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.