పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ను పాన్ వరల్డ్ లెవెల్ కి చేర్చబోయే సినిమా "ప్రాజెక్ట్ కే". నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్ కే టీం స్పెషల్ పోస్టర్ తో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలిపింది. హీరోస్ ఆర్ నాట్ బోర్న్... దే రైజ్... అనే క్యాప్షన్ తో పిడికిలి బిగించిన ఒక వీరుడి (ప్రభాస్) చెయ్యి మాత్రమే ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. ప్రాజెక్ట్ కే సినిమా నుండి ప్రభాస్ కి సంబంధించిన తొలి ప్రమోషనల్ కంటెంట్ ఇదే కావడంతో డార్లింగ్ అభిమానులు సూపర్ ఎక్జయిట్ అవుతున్నారు.
భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ అధినేత అశ్వినీదత్ గారు నిర్మిస్తున్నారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు, దిశా పటాని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.