నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్‌తో యూత్ లో భారీ ఫాలోయింగ్ కూడగట్టింది. కెరీర్ పరంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆమెకు బాగా ప్లస్ అయింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ రోల్ లో రెచ్చిపోయింది నభా. హీరో రామ్ తో ఆమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ యువతకు పిచ్చెక్కించింది. ఈ సినిమాతో నభా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇస్మార్ట్ బేబీ అనే పేరు తెచ్చుకొని కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ముందుంటుంది నభా. ఈ నేపథ్యంలోనే తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. నాభి అందాలు చూపిస్తూ కవ్వించింది ఇస్మార్ట్ పాప.
Starting Diwali celebrations a little early pic.twitter.com/TX0hJqkQ35
— Nabha Natesh (@NabhaNatesh) October 22, 2022