మెగాస్టార్ చిరంజీవి, కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం "మెగా 154"(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.
రేపు ఉదయం 11:07 నిమిషాలకు విడుదల కాబోతున్న మెగా 154 టైటిల్ టీజర్ నుండి ఈ రోజు ఉదయం చిన్న గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఇందులో కింద పడిన సిగరెట్ చిరు చేతికి ఎంతో స్టైల్ గా వస్తుంది. చిరు లుక్ కూడా వెరైటీ గా కనపడుతుంది.
శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.