టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఎదుర్కొంటున్న వరస అపజయాల నుండి సక్సెస్ ట్రాక్ ఎక్కిచ్చిన సినిమా "కృష్ణ వ్రింద విహారి". సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.
తాజాగా ఈ సినిమా నిన్న అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. సో, ఎవరైతే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యారో వాళ్ళూ మరియు సెకండ్ టైం వాచ్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్లి వెంటనే చూసెయ్యండి.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.