మెగాపవర్ స్టార్ రాంచరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా (RC 15)ను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ జపాన్ లో RRR ప్రమోషన్స్ లో ఉండడంతో RC 15 షూటింగ్ కి చిన్న బ్రేక్ పడింది.
చెర్రీ జపాన్ కి వెళ్లేముందే రాజమండ్రిలో ఒక వారం రోజుల షార్ట్ షెడ్యూల్ జరిగిన విషయం తెలిసిందే కదా. తాజాగా RC 15 షూటింగ్ షెడ్యూల్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఈ మేరకు వచ్చే నెల్లో చెర్రీ, కియారా న్యూజిలాండ్ వెళ్లనున్నారట. న్యూజీలాండ్ పిక్చర్స్క్యూ లొకేషన్స్ లో శంకర్ స్టైల్ లో చెర్రీ, కియారాల మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను షూట్ చెయ్యనున్నారట.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.