భారతీయ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం కన్నడ బ్లాక్ బస్టర్ "కాంతార" పేరు మారు మోగిపోతుంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా కాంతార రిమార్కబుల్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది.
తాజాగా కాంతార తన విజయ పరంపరలో మేజర్ రికార్డ్ నమోదు చేసింది. "బుక్ మై షో" ఆన్ లైన్ టికెట్ పోర్టల్ హిస్టరీలో నెవర్ బిఫోర్ రికార్డును కాంతార క్రియేట్ చేసింది. బుక్ మై షో లో 100కే ప్లస్ రివ్యూస్ తో 9.9 రేటింగ్ ని సొంతం చేసుకున్న ఏకైక చిత్రంగా కాంతార రేర్ రికార్డును నెలకొల్పింది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.