పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ రోజు 43వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్తూ ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాల నుండి స్పెషల్ పోస్టర్స్ విడుదలై, డార్లింగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
తాజాగా కొంచెంసేపటి క్రితమే సలార్ నుండి రెండు స్పెషల్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఈసారి ఎలాంటి బ్లాక్ యాష్ కలర్ లేకుండా వదలడంతో ఈ పోస్టర్స్ కు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది. సలార్ గా ప్రభాస్ ఆరడుగుల కటౌట్ ని జస్ట్ పోస్టర్లో చూస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తుంటే, ఇక బిగ్ స్క్రీన్ పై పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో చూస్తే పూనకాలు ఖాయం.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది.