పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ నామస్మరణతో మారుమోగిపోతుంది. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పెషల్ పోస్టర్ తో ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే డార్లింగ్... ఈ సంవత్సరం నీకు చాలా బాగుండాలి... ఈ ఏడాది నీకు మరింత ప్రత్యేకంగా మారేలా మేము మా బెస్ట్ ప్రయత్నిస్తాము... అంటూ సలార్ సెట్స్ లో దిగిన ఒక పిక్ ను పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.