టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "CSI సనాతన్". ఆది కెరీర్ లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు శివశంకర్ దేవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ అప్డేట్ వచ్చింది. సెనోరిటా అనే సాగే బ్యూటిఫుల్ మెలోడీని అక్టోబర్ 27వ తేదీన విడుదల చేస్తామంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, భూపాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.