మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త చిత్రం "గాడ్ ఫాదర్". దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.
తాజాగా ఈ సినిమా నుండి 'అన్నయ్య' అనే సెంటిమెంటల్ వీడియో సాంగ్ విడుదలైంది. చిరు, నయన్ ల మధ్య బ్రదర్ సిస్టర్ సెంటిమెంటల్ నేపథ్యంలో వచ్చే ఈ పాట వెండితెరపై చూస్తే ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు. తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, వైష్ణవి కొవ్వూరి ఆలపించింది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిధి పాత్రలో నటించారు. నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయ, గంగవ్వ, పూరి జగన్నాధ్ ముఖ్యపాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు.