కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "సార్". తమిళంలో "వాతి" టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా రేపు ఉదయం తొమ్మిదింటికి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ కాబోతుంది.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పోతే, ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కాబోతుంది.