ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ గురించి తెలిసిందే. రీ రిలీజ్ సినిమాల లిస్టులోకి తాజాగా 68వ నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగు అవార్డును కొట్టేసిన 'కలర్ ఫోటో' సినిమా కూడా చేరబోతోంది.
నవంబర్ 19వ తేదీన ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లలోకి కలర్ ఫోటో ఎంట్రీ ఇవ్వబోతుందని ఈ రోజు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. వాస్తవానికి ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం కాదు... ఇప్పుడే మొదటిసారి థియేటర్లలోకి అడుగుపెడుతుంది. ఎందుకంటే 2020, అక్టోబర్ 23వ తేదీన తెలుగు ఓటిటి ఆహా లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఓటిటిలో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసిన ఈ మూవీ బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పోతే, ఈ రోజుతో ఈ సినిమాకు రెండేళ్లు.
సందీప్ రాజ్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. సునీల్ కీలక పాత్రలో నటించగా, కాలభైరవ సంగీతం అందించారు.