నిన్న విడుదలైన "బొమ్మ బ్లాక్బస్టర్" థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. 1.2 మిలియన్ వ్యూస్ తో, యూట్యూబ్ #4 ట్రెండింగ్ పొజిషన్ లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది.
నందు, యాంకర్ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రాజ్ విరాట్ డైరెక్టర్. రఘు కుంచె, కిరీటి దామరాజు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
పోతే, నవంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.