ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చియాన్ విక్రమ్ - పా రంజిత్ ల సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 08:37 PM

"పొన్నియిన్ సెల్వన్" సినిమాతో గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు కోలీవుడ్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్. కొంచెంసేపటి క్రితమే ఆయన సోలో కొత్త పాన్ ఇండియా సినిమా ప్రకటన జరిగింది.


విక్రమ్ కెరీర్ లో 61వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకుడు. తాజాగా విడుదల చేసిన ఎనౌన్స్మెంట్ వీడియోలో విక్రమ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక గిరిజన తెగ ప్రాంతంలో జరిగే కథలా అనిపిస్తుంది. పోతే, ఈ సినిమాకు "తంగలాన్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.


ఈ సినిమాలో పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు నీలం ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై KE జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్ కుమార్ జీవీ సంగీతం అందిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com