మెగా అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవిగారి 154వ సినిమా టైటిల్ టీజర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. ముందుగా జరిగిన ప్రచారం మేరకే ఈ సినిమాకు"వాల్తేరు వీరయ్య" అనే టైటిల్ నే ఖరారు చేసారు. ఇక, టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ లో చిరు ఊరమాస్ అవతార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. టీజర్ ను బట్టే ఈ సినిమా అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందని అర్ధమవుతోంది.
కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, క్యాథెరిన్ ట్రెసా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. పోతే, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa