ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "రావణాసుర" విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 12:02 PM

సుధీర్ వర్మ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "రావణాసుర". సుశాంత్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది.


దీపావళి కానుకగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. రావణాసుర విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు రావణాసుర మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.


హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa