సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం". సీనియర్ హీరోయిన్ ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గరపడ్డ నేపథ్యంలో అనుకోని ప్రయాణం మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి వైజాగ్, వరుణ్ బీచ్ రోడ్ లోని నోవాటెల్ ఆపోజిట్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మరి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa