మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం "వాల్తేరు వీరయ్య" సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాబీ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.
ఆ వెంటనే చిరు నుండి రావడానికి మరొక కమర్షియల్ ఎంటర్టైనర్ "భోళాశంకర్" రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ నలభై శాతం పూర్తయిందంట. తమిళ సూపర్ హిట్ "వేదాళం" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరు చిట్టి చెల్లెలిగా నటిస్తుంది.
మెహర్ రమేష్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. పోతే, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.