చిత్ర పరిశ్రమలో ప్రతిభే కీలకం అంటున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. తాను అతిలోక సుందరి శ్రీదేవి-బడా నిర్మాత బోనీ కపూర్ల ముద్దుల కూతురు అని తనకు ఎవరూ రెడ్ కార్పెట్ పరచరని అంటోంది. ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడిన జాన్వీ తన సినిమా అవకాశాల గురించి వెల్లడించింది. సినీ నేపథ్య కుటుంబం వల్ల మొదట్లో తనకు అవకాశాలు వచ్చినా ప్రస్తుతం కథ పూర్తిగా మారిపోయిందని చెబుతోంది ఈ హాట్ భామ. ఇప్పుడు ఎవరైనా తన మీద, తన ప్రతిభ మీద నమ్మకం ఉంటేనే ఛాన్సులు ఇస్తున్నారని తెలిపింది.