వెండితెరపై హీరో తల్లి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు నటి ప్రగతి. ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండింగ్ పాటలకు డాన్సులు, వర్క్‌అవుట్ వీడియోలతో బాగా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రోలింగ్ బారిన కూడా పడుతున్నారు. ఇటీవలే ఓ టాక్‌షోలో ముచ్చటించారు ప్రగతి. తన విడాకులపై స్పందించారు. వైవాహిక జీవితం సాఫీగా సాగేందుకు చాలా ప్రయత్నించానని, అది కుదరకపోవడం వల్లే డైవర్స్ తీసుకున్నట్లు తెలిపారు. పిల్లలను ఒంటరిగా చదివించి ఒక స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పారు.