"ది వారియర్" మూవీ థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే హీరో రామ్ తన నెక్స్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లి, ప్రస్తుతం ఆ మూవీ షూట్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్టర్.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఉండబోయే ఒక మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ గార్జియస్ బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ప్రయతిస్తున్నారట. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. అన్ని కుదిరితే, ఈ సినిమా ద్వారా ఊర్వశి రౌతేలా టాలీవుడ్ డిబట్ ఎంట్రీ జరిగే అవకాశం కనిపిస్తుంది.
పోతే, ఈ సినిమాలో హీరో రామ్ కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.