ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సినిమా తరవాత ఎక్కువ కాలం విరామం తీసుకోకుండా వెంటనే వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ ను పునఃప్రారంభించారు.
దీపావళి అనంతరం స్టార్ట్ ఐన కొత్త షెడ్యూల్ లో మెగాస్టార్ పై డెడ్లీ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ను షూట్ చేస్తున్నారట. వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చేసే ఈ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ మెగా అభిమానులకు కిర్రాక్ ఫీలింగ్ తీసుకొస్తుందట. మరి చూడాలి, వచ్చే సంక్రాంతికి విడుదల కాబోయే ఈ మూవీ లో వాల్తేరు వీరయ్యగా చిరు ఏపాటి విజయాన్ని అందుకుంటారో..!!
బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు.