కన్నడ సినిమాగా పాన్ ఇండియా భాషల్లోకి డబ్ అయి, థియేటర్లలో విడుదలైన "కాంతార" సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందంటే, ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంత గొప్ప ఆదరణను చూపిస్తున్నారో తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా మరొకసారి హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే, నవంబర్ 14వ తేదీన, హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తో కలిసి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు కాంతార స్పెషల్ స్క్రీనింగ్ ను వాచ్ చేయబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.