దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. సినీతారల దీపావళి సెలెబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా జరుపుకున్న దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణను సంతరించుకున్నాయి. లాస్ ఏంజెల్స్ లోని తన సొంతింటిలో భర్త నిక్ జోనస్, ముద్దుల కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనస్ తో కలిసి ప్రియాంక దీపావళిని జరుపుకుంది. తమ దీపావళి ఎంత వైభవంగా జరిగిందో తెలియచేస్తూ జోనస్ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫొటోస్ లో నిక్, ప్రియాంక, బుజ్జి పాపాయి ఉన్నారు. కూతురు ముఖం కనిపించకుండా పాప ఫేస్ పై లవ్ సింబల్ ని పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది జనవరిలో ప్రియాంక, నిక్ దంపతులు సరోగసీ ద్వారా ఒక పాపాయికి జన్మనిచ్చారు.