టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ పేరు ప్రస్తుతం న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరుకి ధీటుగా నిలిచే పవర్ఫుల్ అండ్ స్టైలిష్ విలన్ రోల్ లో నటించి ప్రేక్షకుల మెప్పును అందుకున్నారు. తాజాగా రామ్ సేతు సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసి అక్కడి ప్రేక్షకులను కూడా తన విలక్షణ నటనతో కట్టి పడేస్తున్నారు.
సత్యదేవ్ హీరోగా, ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా సత్యదేవ్ కెరీర్ లో 26వ సినిమా. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో వెటరన్ యాక్టర్ సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారంటూ కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు.
పోతే, ఈ చిత్రంలో పుష్ప ఫేమ్ జాలి రెడ్డి అకా డాలి ధనంజయ కూడా క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.