నిన్నిలా నిన్నిలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటుడు అశోక్ శెల్వన్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ఆకాశం. తమిళంలో నితం ఒరు వానం టైటిల్ తో తెరకెక్కినది.
తాజాగా ఈ సినిమా నుండి ఊపిరే అనే బ్యూటిఫుల్ మెలోడీని ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ రోజు సాయంత్రం ఐదింటికి విడుదల చెయ్యనున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి.
రా కార్తీక్ డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.