కన్నడ నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన చిత్రం "కాంతార". హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.
ముందుగా కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఐన ఈ మూవీ ఆ వెంటనే మిగిలిన అన్ని భాషల్లోనూ విడుదలై, ప్రతిచోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
హిందీ లో ఈ సినిమా మంగళవారం 2. 35 కోట్లను కలెక్ట్ చేసింది. వర్కింగ్ డేస్ లో కూడా ఇంత మంచి నంబర్లను నమోదు చెయ్యడం పట్ల సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు కాంతార మూవీ హిందీలో ఇరవై ఆరున్నర కోట్లను వసూలు చేసింది.