"లైగర్" సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకు హలో చెప్పారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లైగర్ ప్రమోషన్స్ సమయంలో విజయ్ దేవరకొండ హిందీ అభిమానులను చూసిన వారెవరికైనా వారెవ్వా అనిపిస్తుంది. ఎలాంటి సినిమా చెయ్యకుండానే హిందీ లో విజయ్ కున్న క్రేజ్ లైగర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమాను డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా మేకింగ్ సమయంలో ఏర్పడిన అనుబంధం కారణంగా కరణ్ విజయ్ తో మరొక సినిమాను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఈసారి ఎలాగైనా హిందీలో విజయ్ కు గ్రాండ్ సక్సెస్ ను అందివ్వడమే ధ్యేయంగా కరణ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మరైతే ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.