రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్ హిట్ మూవీ "RRR" ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యం పొందుతుంది. విడుదలైన దగ్గర నుండి సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ వస్తున్న ఈ మూవీ తాజాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది.
అమెరికన్ అవార్డ్స్ ఐన "ది సాటర్న్" అవార్డుల కార్యక్రమంలో RRR మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా అవార్డు సొంతం చేసుకుంది. ఈ మేరకు వర్చ్యువల్ గా సాటర్న్ జ్యూరీకి కృతజ్ఞతలు తెలుపుతున్న రాజమౌళి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రాజమౌళి RRR కు ఈ అవార్డు రావడం తనకి, తన మూవీ టీం కి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని చెప్పారు. ఇది తన రెండవ సాటర్న్ అవార్డు అని, బాహుబలి ది కంక్లూజన్ సినిమాకు గానూ తొలి సాటర్న్ అవార్డు అందుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మిగిలిన విజేతలకు రాజమౌళి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియచేసారు.
RRR ప్రమోషన్స్ నిమిత్తం ప్రస్తుతం జపాన్ లో ఉన్న రాజమౌళి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయినట్టు తెలుస్తుంది.