కొంత గ్యాప్ తదుపరి అల్లు శిరీష్ హీరోగా నటించిన కొత్త చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 30వ తేదీన జరగబోయే ఉర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు రాబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.
రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతుంది.