cinema | Suryaa Desk | Published :
Wed, Oct 26, 2022, 01:56 PM
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మరో ఘనత సొంతం చేసుకుంది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే ప్రముఖ శాటర్న్ అవార్డ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్‌కు దక్కింది. ఈ సందర్భంగా జ్యూరీకి రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి-2 తర్వాత జక్కన్నకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డు ఇది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆస్కార్ బరిలోనూ నిలుస్తోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com